Wednesday, December 30, 2009

నాకు తెలవక అడుగుతా..ఏంది ఈ గోల ..!?

గత రెండు నెలలుగా రాష్ట్రంలో నరక యాతన అనుభవిస్తున్న
సామాన్యుడు ఆకలి గొంతుతో, ఆవేధనతో మన దౌర్భాగ్యపు "ప్రజా" సేవకులను
ఇలా నిలదీస్తున్నాడు..

అరె ఏంది రా భై ఈ లొల్లి..నా చావునకు వచ్చినది ?
పోద్దస్తామాను ఈ బంధులేంది, ఈ లొల్లి ఏంది ?
కాయకష్టం చేసి బ్రతికేటోల్లం..మేమేం కావాలి. ఏడికి పోవాలి ?

అయినా నాకు తెలవక అడుగుతా.. దేనిగురించి ఈ లొల్లి ?
ప్రత్యేక రాష్ట్రమంటే ఏంది రా భై ? సమైఖ్యాంధ్ర అంటే ఏంది రా భై ?
మన గురజాడ సార్ ఏషిణ ప్రశ్న మల్లెస్తున్నా...
"దేశమంటే ఏంది ? మట్టా ? మనుషులా?" ? జరా చెప్పుండ్రి ?
నాయకులు మస్తుగా పైసలు తిని చక్కంగా చలి కేంద్రం లలో గూచోనీ బందు గింద్ లాంటుర్రు ..
నాకు రెక్కాడితే గాని డొక్క ఆడదు. నేను ఎప్పుడైనా యాదికి వచినాన్రా మీకు ?

అయినా నాకు తెలవక అడుగుతా..ఏంది మైకులు బట్టి తెగ పేల్తున్నారు..?
నాలికలు కోస్తామంటుర్రు. అందుకేనేరా మీరు జీతాలు జీతాలు దీసుకోనేటిది ?
హైదరాబాద్ నీదానాదా అని వాగులాడుతుర్రు.. ఇంకా మింగనికి ఉన్నాదిర ?
అస్సల్ కూలికి పోలేకా, తిండి లేక నేను చస్తుంటీ .. ఏన్దిరా ఈ గోల ?

కొడుకుల్లారా "గాంధీ" పిత యాదికినా మీకు ? ఆయనేం చెప్పిండు ?
నేనే మీకు ప్రభువు, దేవత, అన్న, అయ్యా, దేవుడు అన్నీ.
నేను కష్ట పడి సంపాదించి కట్టిన టేక్సు డబ్బులతోనే మీరు ఉండేటిది.
ఎరుకైనాది ర ?

అవున్రా నాకు తెలవక అడుగుతా.. మీరు రోజూ కొలువుకు వోరా ?
మొన్న ఎల్లచ్చాన్న్లప్పుడు వచ్చి నేను అస్సెమ్బ్లే కి పోతా పార్లమేంటి కి పోతా నంటే
సర్లే పోండీ అని పంపించిని గదా ?
మళ్ళీ ఈ లొల్లి ఏంది రా ? మీరు అక్కడే గూచోని పని చేయ్యుర్రి.
నన్ను కూడా జరా పని చేయ్యనీరి. లేక పొతే మీ కూడు గుడ్డ గూడ ఖతమైతాయ్..
సమజైనాదిరా ? ఏడికెల్లి వస్తారో ఏమో నా పేనాలు గుంజనీకి..!

బ్రతికోన్నోల్లను చంపే ఈ బందులు ఆపున్డ్రి.
మీ ప్రభువు.

No comments: