Saturday, April 18, 2009

నాణ్యమైన జీవనము

నాణ్యమైన జీవనము నల్గురికి ఆదర్శం
స్వార్ధరహిత జీవనమే జీవిత పరమార్ధం ''నా"

నీ కోసం జీవిస్తే నీతోనే సరేసరి
జనం కోసం జీవిస్తే మరణమే లేదు మరి ''నా"

ఆరోగ్యం, ఆనందం కలగలిసిన జీవనాన్ని ఆహ్వానిద్దాం
విలాసవంత విచ్చలవిడి జీవనాన్ని విసర్జిద్దాం ''నా"

ప్రేమ, అభిమానాలను పదిమందికి పంచుదాం
మానవతా విలువలు, ప్రమాణాలు అందరిలో పెంచుదాం ''నా"

డా
. రామకృష్ణంరాజు కలిదిండి

No comments: