ఇలా నిలదీస్తున్నాడు..
పోద్దస్తామాను ఈ బంధులేంది, ఈ లొల్లి ఏంది ?
కాయకష్టం చేసి బ్రతికేటోల్లం..మేమేం కావాలి. ఏడికి పోవాలి ?
"దేశమంటే ఏంది ? మట్టా ? మనుషులా?" ? జరా చెప్పుండ్రి ?
నాకు రెక్కాడితే గాని డొక్క ఆడదు. నేను ఎప్పుడైనా యాదికి వచినాన్రా మీకు ?
అయినా నాకు తెలవక అడుగుతా..ఏంది మైకులు బట్టి తెగ పేల్తున్నారు..?
నాలికలు కోస్తామంటుర్రు. అందుకేనేరా మీరు జీతాలు జీతాలు దీసుకోనేటిది ?
హైదరాబాద్ నీదానాదా అని వాగులాడుతుర్రు.. ఇంకా మింగనికి ఉన్నాదిర ?
అస్సల్ కూలికి పోలేకా, తిండి లేక నేను చస్తుంటీ .. ఏన్దిరా ఈ గోల ?
కొడుకుల్లారా "గాంధీ" పిత యాదికినా మీకు ? ఆయనేం చెప్పిండు ?
నేనే మీకు ప్రభువు, దేవత, అన్న, అయ్యా, దేవుడు అన్నీ.
అవున్రా నాకు తెలవక అడుగుతా.. మీరు రోజూ కొలువుకు వోరా ?
మొన్న ఎల్లచ్చాన్న్లప్పుడు వచ్చి నేను అస్సెమ్బ్లే కి పోతా పార్లమేంటి కి పోతా నంటే
సర్లే పోండీ అని పంపించిని గదా ?
మళ్ళీ ఈ లొల్లి ఏంది రా ? మీరు అక్కడే గూచోని పని చేయ్యుర్రి.
నన్ను కూడా జరా పని చేయ్యనీరి. లేక పొతే మీ కూడు గుడ్డ గూడ ఖతమైతాయ్..
సమజైనాదిరా ? ఏడికెల్లి వస్తారో ఏమో నా పేనాలు గుంజనీకి..!
బ్రతికోన్నోల్లను చంపే ఈ బందులు ఆపున్డ్రి.
మీ ప్రభువు.